Header Banner

గుంటూరు ఉద్యాన రైతులకు గుడ్ న్యూస్..! వాటి సాగుపై రాయితీ పెంపుదల!

  Fri May 23, 2025 18:31        Politics

 

 

గుంటూరు జిల్లాలో ఉద్యాన పంటల సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు నష్టాలు మిగులుతున్న వ్యవసాయ పంటల కంటే, తక్కువ కష్టంతో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పండ్ల మొక్కల పంపిణీ, నిర్వహణ, నీటి సరఫరా, మందులు, ఎరువుల కోసం మూడు సంవత్సరాల పాటు సాయం అందజేస్తున్న ప్రభుత్వం, తాజాగా రాయితీ మొత్తాన్ని భారీగా పెంచింది. గత ఏడాది మామిడి తోటల కోసం కేవలం రూ.13,300 మాత్రమే రాయితీగా ఇస్తే, ఈ ఏడాది దాన్ని రూ.50,000 వరకు పెంచింది.

 

ఇది కూడా చదవండి: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?

 

వివరాల్లోకి వెళ్తే, ముఖ్యంగా మెట్ట భూముల్లో పండ్ల తోటల సాగుకు అనుకూల వాతావరణం ఉండటంతో, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉపాధి హామీ కింద 5 ఎకరాల్లోపు భూమి కలిగిన సన్న, చిన్నకారు రైతులు పూర్తిస్థాయిలో రాయితీ పొందవచ్చు. గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్‌లను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి రమణారెడ్డి మాట్లాడుతూ, రైతులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయంతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు పండ్లతోటల వైపు మళ్లితే మంచి లాభాలు పొందవచ్చని అన్నారు.



ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

 

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!


ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!


ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!


దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!


అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!


అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #GunturFarmers #HorticultureSubsidy #APGovtSchemes #FruitFarming #FarmerSupport #APHorticulture #SmallFarmers